Share News

Trump In UN Speech: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపా: ట్రంప్

ABN , Publish Date - Sep 23 , 2025 | 08:46 PM

యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని కూడా ట్రంప్ విమర్శించారు. యుద్ధాలను పరిష్కరించేందుకు కనీసం సహకరించే ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. ఉత్తుత్తి మాటలు యుద్ధాలను పరిష్కరించ లేవన్నారు.

Trump In UN Speech: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపా: ట్రంప్
Donald Trump UN Speech

న్యూయార్క్: భారత్-పాక్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ పదేపదే చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటనను భారత్ ఆనేక సార్లు ఖండించినా ఆయన తీరు మాత్రం మారడం లేదు. ప్రెస్‌మీట్ అయినా, సామాజిక మాధ్యమమైనా, వేదిక ఏదైనా అదే తీరు. మంగళవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA)లోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ప్రకటించుకున్నారు. కేవలం ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపానని చెప్పారు.


'ఇజ్రాయెల్-ఇరాన్, ఇండియా-పాకిస్థాన్, రువాండా-డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయ్‌లాండ్-కంబోడియా, అర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిప్ట్-ఇథియోపియా, సెర్బియా-కొసావో యుద్ధాలను నేనే ఆపాను' అని ట్రంప్ 80వ యూఎన్‌జీఏ సెషన్‌లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. ఏ ఒక్క అధ్యక్షుడు కానీ, నేత కానీ ఇంతకుముందు ఇంత పని చేయలేదు.. అని చెప్పుకున్నారు. ఈ యుద్ధాలకు ముగింపు లేదని కొందరు అన్నారు. కొన్ని యుద్ధాలు 31 ఏళ్లుగా సాగుతున్నాయి. ఒక యుద్ధం 36 ఏళ్లుగా సాగుతోంది. నేను 7 యుద్ధాలు ఆపాను. ఈ యుద్ధాల్లో లెక్కకు మించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఏ అధ్యక్షుడూ ఇంతలా చేసింది లేదు.. అని ట్రంప్ పేర్కొన్నారు.


యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని కూడా ట్రంప్ విమర్శించారు. యుద్ధాలను పరిష్కరించేందుకు కనీసం సహకరించే ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. ఉత్తుత్తి మాటలు యుద్ధాలను పరిష్కరించ లేవన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో డ్రోన్ల కలకలం..40కి పైగా విమానాలు రద్దు, మరికొన్ని

టెక్సాస్‌లో హనుమాన్‌ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 08:50 PM