Drones Flight Disruption: ఆకాశంలో డ్రోన్ల కలకలం..40కి పైగా విమానాలు రద్దు, మరికొన్ని
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:02 AM
యూరోప్‌లోని పలు ప్రాంతాల్లో అనుకోకుండా ఆకాశంలో పెద్ద ఎత్తున డ్రోన్లు కనిపించాయి. దీంతో పలు ఎయిర్‌పోర్టులలో వాతావరణ సమస్యలు ఏర్పడగా..40కిపైగా విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.
యూరోప్ పరిధిలో అనుకోకుండా ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు కనిపించడం పెద్ద గందరగోళానికి దారి తీసింది. (Drone Flight Disruption) . దీంతో కోపెన్‌హేగెన్ (డెన్మార్క్), ఒస్లో (నార్వే) ఎయిర్‌పోర్టులు డ్రోన్ల కారణంగా సజావుగా పనిచేయలేకపోయాయి. విమానాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు 40కిపైగా విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఈ సంఘటనలు ప్రయాణికులకు ఇబ్బందులను కలిగించాయి.
పెద్ద డ్రోన్ల గందరగోళం
సోమవారం రాత్రి 8:30 గంటల తర్వాత కోపెన్‌హేగెన్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో రెండు, మూడు పెద్ద పరిమాణపు డ్రోన్లు ఎగురుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా ఎయిర్ పోర్టులో ఫ్లైట్స్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వాటిని పర్యవేక్షించిన పోలీసులు..అవి సాధారణ వ్యక్తులు వినియోగించే డ్రోన్ల కన్నా పెద్దవిగా ఉన్నాయని తెలిపారు. డ్రోన్లను ఓ వ్యక్తి ఎగరేస్తుండగా ఎయిర్‌పోర్ట్ వైపు వచ్చాయన్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్ సేవలు 12:20 గంటలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. కానీ ఫ్లైట్స్ ఆలస్యాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి.
ఇక్కడ కూడా..
మరోవైపు ఒస్లో ఎయిర్‌పోర్ట్‌లో కూడా మంగళవారం ఉదయం అనుమానాస్పద డ్రోన్ కనిపించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్లను సమీప ఎయిర్‌పోర్టులకి మళ్లించారు. అదే సమయంలో నార్వే పోలీసులు, దీని పరిధిలో డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు.
ఇటీవల రష్యా డ్రోన్లు పోలాండ్, రొమేనియా లాంటి దేశాలు దాటి వెళ్లినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యూరప్ దేశాలు, డ్రోన్లు కనిపిస్తే చాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సంఘటనలతో వాటికి సంబంధం ఉందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి