Ind Slams Pak PM: పాక్ ప్రధానికి గట్టిగా బుద్ధి చెప్పిన భారత దౌత్యవేత్త
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:44 AM
ఐక్యరాజ్య సమితి వేదికగా తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన పాక్ ప్రధానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ దుర్నీతిని భారత దౌత్య వేత్త పేటల్ ఎండగట్టారు. పాక్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించి నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సింధు నదీ జలాల ఒప్పందం, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో తన దుర్బుద్ధిని ప్రదర్శించిన పాక్ ప్రధాని షహబాస్ షరీఫ్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునేందుుకు ఆయన ఆసంబద్ధ నాటకీయ ప్రదర్శించారంటూ దుమ్ము దులిపేసింది (India UN rebuttal Pakistan).
పాక్ ప్రధాని అనవనసర నాటకీయతను ప్రదర్శించారని భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ఆకాశానికెత్తేశారని ఆక్షేపించారు. ఎంత నాటకీయత ప్రదర్శించినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలను దాచలేరని అన్నారు. పహల్గాం దాడి వెనకున్న ఉగ్రసంస్థకు పాక్ పాలకులు ఇదే అసెంబ్లీలో కొమ్ముకాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఇతర దేశాలపైకి ఎగదోసిన చరిత్ర పాక్‌కు ఉందని అన్నారు. పాక్ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది ఎవరో గుర్తు చేసుకోవాలని సభ్య దేశాలను కోరారు. దశాబ్దాలుగా పాక్ భూభాగంలో ఉగ్ర క్యాంపులు జరుగుతున్న విషయాన్ని పాక్ మంత్రులు ఇటీవలే అంగీకరించారని తెలిపారు. కాబట్టి, పాక్ ప్రధాని ద్వంద్వ వైఖరి కొత్తేమీ కాదని, ఇందులో ఆశ్చర్యపోయేందుకు ఏమీ లేదని అన్నారు (Shehbaz Sharif UN speech criticism).
ఇక పాక్ ప్రధాని ఎప్పటిలాగే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ కశ్మీర్ ప్రజలకు ఉండాలని అన్నారు. ఈ దిశగా తాము వారికి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే, పాక్ ప్రధాని ప్రసంగాన్ని భారత్ ఖండించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇది పాక్ ప్రధాని చేసిన ప్రయత్నమని ఎండగట్టింది. ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుతున్న ఉగ్రవాదుల్ని అప్పగించాలని దౌత్యవేత్త పేటల్ అన్నారు. అణు బెదిరింపుల మాటున ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఊరుకునేది లేదని అన్నారు. భారత్, పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
అతిగా లాబీయింగ్ చేయొద్దు.. ట్రంప్‌కు నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరిక
ఐరోపా గగనతలంలో ప్రయాణించని ఇజ్రాయెల్ ప్రధాని..అరెస్టు భయమే కారణమా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి