లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న బాలివుడ్ స్టార్ షారుక్ ఖాన్
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:26 AM
సోమవారం లాల్‌బాగ్‌చా రాజాను బాలివుడ్ స్టార్ షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా గణపతిని బాలివుడ్ స్టార్ షారుక్ ఖాన్ సోమవారం దర్శించుకున్నారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఆయన వినాయకుడి ఆశీస్సులు పొందారు. షారుక్ రాకతో ఆ గణేశ్ మండపంలో భక్తులు, అభిమానుల తాకిడి పెరిగింది. వినాయక దర్శనానికి షారుక్ కుర్తా ధరించగా, ఆయన సతీమణి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
కాగా ముంబై లాల్‌బాగ్‌చా రాజాను ఈ ఏడాది పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్, శిల్పా శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, జెనీలియా దేశ్‌ముఖ్ తదితరులు వినాయకుడి దర్శనభాగ్యం పొందారు.
షారుక్ ఇంట వినాయక పూజ
తమ నివాసంలో ఏటా వినాయకుడి పూజ నిర్వహిస్తామని షారుక్ ఈ నెల ప్రారంభంలోనే వెల్లడించారు. ఓ అభిమాని గణేష్ చతుర్థిపై అడిగిన ప్రశ్న ఆయన సమాధానమిచ్చారు. ‘నా భార్య వినాయక చవితి రోజు పూజ చేస్తుంది. తరువాత మేమంతా దేవుణ్ని ప్రార్థిస్తాం. రాత్రికి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం’అని ఆయన తెలిపారు. ప్రస్తుతం షారుక్ లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాతో వైరలవుతోంది.
ఈ వార్తలూ చదవండి
సోనియా ఓటు-పౌరసత్వం కేసులో ఆ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు యాంత్రికం