Share News

మా సమస్యలు పరిష్కరించాలి.. పవన్ కల్యాణ్‌కు సహారా ఫీల్డ్ వర్కర్స్ వినతి

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:56 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సహారా ఫీల్డ్ వర్కర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కలిశారు. పవన్ కాన్వాయ్ వద్దకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.

మా సమస్యలు పరిష్కరించాలి.. పవన్ కల్యాణ్‌కు సహారా ఫీల్డ్ వర్కర్స్ వినతి
AP Deputy CM Pawan Kalyan

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పిఠాపురంలో విసృత్తంగా పర్యటిస్తున్నారు. పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొంటున్నారు. ఈరోజు (మంగళవారం) ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రి సెంటర్‌ వద్ద పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సమయంలో సహారా ఫీల్డ్ వర్కర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. పవన్ కాన్వాయ్ వద్దకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.


వారి సమస్యలను పవన్ కల్యాణ్ విన్నారు. సహారా నుంచి కోటి మంది డిపాజిట్ వర్క్స్‌కు సంబంధించిన రూ.25 వేల కోట్లు రావాల్సి ఉందని వినతిపత్రం అందజేశారు. ఈ డబ్బులు అందక డిపాజిటర్ల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 10:45 AM