Share News

రాజకీయాల్లోకి మహమ్మద్‌ షమీ?

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:49 AM

భారత జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ.. రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లోకి మహమ్మద్‌ షమీ?
shami

ఆర్‌ఎల్‌డీ చీఫ్‌తో భారత క్రికెటర్‌ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: భారత జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ.. రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షమీ తాజాగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ చీఫ్‌ జయంత్‌ చౌధరితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో షమీ ఆర్‌ఎల్‌డీ నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అమ్రోహా అసెంబ్లీ స్థానం నుంచి షమీ బరిలోకి దిగుతాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 22 , 2026 | 04:49 AM