Home » Madras High Court
విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ సాధించిన విజయాలను ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.
ఎన్నికల వివాదానికి సంబంధించి ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్యానించింది.
దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్శనాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై ప్రభుత్వం స్పందించేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.
‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీలతో తలబడుతున్న టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? టీవీకే పార్టీ నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.