Share News

BJP Leader: బీజేపీ నేత నగర ప్రవేశంపై ఆంక్షలు రద్దు

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:08 AM

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో ప్రవేశించరాదని బీజేపీ ఎస్పీ మోర్చా నాయకుడు నెడుకుండ్రం సూర్యకు నగర పోలీసు కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. నెడుకుండ్రం సూర్యపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఆయనను నగరంలో ప్రవేశించేందుకు ఎందుకు నిషేధం విధించరాదు అంటూ వివరణ కోరుతూ కొళత్తూర్‌ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ నోటీసు జారీచేశారు.

BJP Leader: బీజేపీ నేత నగర ప్రవేశంపై ఆంక్షలు రద్దు

చెన్నై: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో ప్రవేశించరాదని బీజేపీ(BJP) ఎస్పీ మోర్చా నాయకుడు నెడుకుండ్రం సూర్యకు నగర పోలీసు కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు(Madras High Court) రద్దు చేసింది. నెడుకుండ్రం సూర్యపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఆయనను నగరంలో ప్రవేశించేందుకు ఎందుకు నిషేధం విధించరాదు అంటూ వివరణ కోరుతూ కొళత్తూర్‌ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ నోటీసు జారీచేశారు.


nani3.2.jpg

ఈ నోటీసుకు సూర్య వివరణ ఇచ్చిన నేపథ్యంలో, అతను గత ఏప్రిల్‌ 25 నుంచి ఏడాది పాటు చెన్నై(Chennai)లో ప్రవేశించరాదని పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వాటిని వ్యతిరేకిస్తూ సూర్య దాఖలుచేసిన పిటిషన్‌ విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సతీష్ కుమార్‌ విచారించగా, సూర్య తరఫున.. పోలీసు శాఖ నోటీసుకు తగిన వివరణ ఇచ్చినా, పరిశీలించకుండా ఉత్తర్వులు జారీ చేశారని వాదించారు. పిటిషనర్‌ వాదన పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి, పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2025 | 11:08 AM