Share News

Karur Stampede: టీవీకే పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Oct 03 , 2025 | 01:30 PM

టీవీకే పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ప్రారంభ దశలోనే CBI దర్యాప్తు కోరడం సరికాదని సూచించింది.

Karur Stampede: టీవీకే పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
Madurai Bench Serious On TVK petition

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని మద్రాస్ హైకోర్టులో టీవీకే పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


విచారణ ప్రారంభ దశలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చకూడదని హెచ్చరించింది. ప్రభుత్వాలతోపాటు ప్రజలకూ అవగాహన, బాధ్యత ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఇలాంటి పెద్ద సమావేశాలకు హాజరుకావడానికి ముందుగా ఆలోచించి, జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.


కరూర్ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, అవసరమైతే తదుపరి దశలో సరైన చర్యలు తీసుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ప్రజల ప్రాణాలకు భంగం కలిగించే సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించింది.


Also Read:

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత, ప్రత్యేక దేశం డిమాండ్!

హ్యాండ్ షేక్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..

For More Latest News

Updated Date - Oct 03 , 2025 | 05:01 PM