Handshake diseases: హ్యాండ్ షేక్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..
ABN , Publish Date - Oct 03 , 2025 | 12:36 PM
ఎదుటి వ్యక్తిని పలకరించడానికో.. శుభాకాంక్షలు తెలపడానికో షేక్ హ్యాండ్ ఇవ్వటం అన్నది సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే, షేక్ హ్యాండ్ కారణంగా మన ప్రాణాలుకు ముప్పు ఉంది. ప్రాణాంతకమైన రోగాలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంది..
ఎదుటి వ్యక్తిని పలకరించడానికో.. శుభాకాంక్షలు తెలపడానికో షేక్ హ్యాండ్ ఇవ్వటం అన్నది సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే, షేక్ హ్యాండ్ కారణంగా మన ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన రోగాలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. హ్యాండ్ షేక్ ఇచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలని, లేదంటే ఈ 6 జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అవి ఏంటంటే..

1) జలుబు
హ్యాండ్ షేక్ ద్వారా అత్యంత స్పీడుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే జబ్బు ఇదే. షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు జలుబు ఉన్న వ్యక్తి నుంచి వైరస్ జబులు లేని వ్యక్తి చేతి మీదకు ప్రవేశిస్తుంది. ఆ వ్యక్తి చేతిని ముక్కుపై గానీ, ముఖంపై గానీ రుద్దుకున్నపుడు వైరస్ ముఖంపైకి చేరుతుంది. అలా శరీరంలోకి ప్రవేశించి జలుబు చేస్తుంది.

2) ఫ్లు
ఫ్లు అనేది జలుబు కంటే తీవ్రమైనది. ఫ్లు వైరస్ మనిషి చేతిపై కొన్ని గంటల పాటు ప్రాణాలతో ఉండగలదు. షేక్ హ్యాండ్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. తీవ్రస్థాయిలో జ్వరం, ఒళ్లునొప్పులు, తీవ్రమైన అలసట, దగ్గు వంటివి ఫ్లు లక్షణాలు.

3) కండ్లకలక
కండ్ల కలకలు అనేవి పెద్ద ప్రమాదంగా అనిపించకపోవచ్చు. కానీ, హ్యాండ్ షేక్ ద్వారా ఇది అత్యంత వేగంగా ఒకరిని నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

4) డయేరియా
డయేరియా కలిగించే ఈ కొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియాలు ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆ బ్యాక్టీరియాల కారణంగా తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డోరు హ్యాండిల్స్, ఆహారం, షేక్ హ్యాండ్స్ ద్వారా కూడా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరిని చేరుకుంటుంది.

5) కోల్డ్ సోర్స్
కోల్డ్ సోర్స్ ‘హెర్పెస్ సింప్లెక్స్ వైరస్’ కారణంగా వస్తాయి. పెదాల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి. వాటి కారణంగా అన్నం తినాలన్నా, మాట్లాడాలన్నా నరకం చూడాల్సి వస్తుంది. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ హ్యాండ్ షేక్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుంది.

6) స్కిన్ ఇన్‌ఫెక్షన్లు
కొన్ని రకాల స్కిన్ ఇన్‌ఫెక్షన్లు షేక్ హ్యాండ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఫంగీ, స్టాఫ్ బ్యాక్టీరియా కారణంగా చర్మం ఎర్రగా మారటం, చిన్ని చిన్న పుండ్లు ఏర్పడటం, దురద వంటివి వస్తాయి. అయితే, ఇవి చిన్న సమస్యలుగానే కనిపించినా.. సరైన సమయానికి వైద్యం చేయించుకోకపోతే తర్వాతి కాలంలో తీవ్ర సమస్యలుగా మారే అవకాశం ఉంది. శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది.
(Note: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి..
Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు..