Karur Stampede: కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:33 PM
టీవీకే న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు ఎస్.అరివాళగన్ సారథ్యంలోని కొందరు అడ్వకేట్లు ఆదివారంనాడు గ్రీన్‌వేస్ రోడ్డులోని జస్టిస్ ఎం.దండపాణి నివాసానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయంగా కరూర్ విషాద ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
చెన్నై: కరూర్(Karur)లో శనివారం నాడు నిర్వహించిన పార్టీ ర్యాలీలో తొక్కిసలాట (Stampede) జరిగి 40 మంది మృతిచెందిన ఘటనపై సీబీఐ లేదా సిట్ చేత దర్యాప్తు జరిపించాలని నటుడు-రాజకీయనేత విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే (TVK) మద్రాసు హైకోర్టును కోరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.దండపాణి ముందు ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది.
టీవీకే న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు ఎస్.అరివాళగన్ సారథ్యంలోని కొందరు అడ్వకేట్లు ఆదివారం నాడు గ్రీన్‌వేస్ రోడ్డులోని జస్టిస్ ఎం.దండపాణి నివాసానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయంగా కరూర్ విషాద ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
కాగా, మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి సూచించినట్టు టీవీకే పార్టీ కార్యకర్త నిర్మల్ కుమార్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్‌పై విచారణ చేపడతామని జస్టిస్ దండపాణి తెలిపినట్టు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఘటనపై పూర్తి నివేదికను అందించనుంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి