Share News

Vijay rally stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:50 AM

తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. ఈ విషాదంలో 38 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Vijay rally stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?
Vijay event tragedy

తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. ఈ విషాదంలో 39 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇంతటి భారీ విషాదానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు డీజీపీ జి. వెంకటరామన్ ఈ ఘటనపై స్పందించారు. ఈ తొక్కిసలాటకు కారణాలు వివరించారు (Vijay event tragedy).


కరూర్ సభకు పది వేల మంది వస్తారని నిర్వాహకులు ఊహించారని, కానీ దాదాపు 27,000 మంది వచ్చారని, ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని నియమించామని డీజీపీ అన్నారు (crowd control failure). విజయ్ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అనుమతి కోరారని, అయితే టీవీకే ట్విటర్ ఖాతాలో మాత్రం విజయ్ 12 గంటలకే వస్తారని పేర్కొన్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి జనం రావడం ప్రారంభించారని, విజయ్ చివరకు సాయంత్రం 7.40 గంటలకు వచ్చారని తెలిపారు. అంతసేపు ఎండలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు లేదని తెలిపారు (Tamil actor Vijay news).


జన సమూహాన్ని పెంచడం కోసమే విజయ్ కరూర్ సభకు అంత ఆలస్యంగా వచ్చారని కొందరు విమర్శిస్తున్నారు (security lapses). ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై సమగ్ర దర్యాఫ్తునకు ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్‌ ఘటనపై పూర్తి నివేదికను అందించబోతోంది. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

'ఐ లవ్ మహమ్మద్‌' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు

వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. లద్దాఖ్ హింసపై డీజీపీ ప్రకటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 10:50 AM