Madras High Court: ఈడీకి 30 వేల జరిమానా
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:10 AM
తమిళ సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పారిశ్రామికవేత్త విక్రమ్ రవీంద్రన్ గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలకు
కౌంటర్ దాఖలు చేయలేదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
చెన్నై, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తమిళ సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పారిశ్రామికవేత్త విక్రమ్ రవీంద్రన్ గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలకు సంబంధించిన కేసులో రెండు సార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని ఈడీ అధికారులకు మద్రాస్ హైకోర్టు రూ.30 వేల జరిమానా విధించింది. టాస్మాక్ మద్యం కుంభకోణంతో సంబంధం ఉందన్న కారణంగా ఆ ఇద్దరి ఇళ్లలో ఈడీ అధికారులు గతంలో సోదాలు చేపట్టారు. రవీంద్రన్ ఇంటికి, ఆఫీసుకు సీలు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత నెల 20వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు.. ఆ ఇద్దరి గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపేందుకు ఈడీకి ఎలాంటి అధికారమూ లేదని పేర్కొంది. ఈడీ అధికారులు హైకోర్టుకు సమర్పించినవాటిలో వారిద్దరికీ వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని పేర్కొంది. తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్‌డిస్క్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లను తిరిగి వారికి అప్పగించి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రెండు సార్లు అవకాశం ఇచ్చినా బుధవారం జరిగిన విచారణ సమయానికి కూడా ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
Read Latest Telangana News and National News