Share News

Rahul Gandhi: అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:45 PM

రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కోర్టు చుట్టూ భద్రతను పెంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. రాంచీ నుంచి చాయిబాసాకు రాహుల్ హెలికాప్టర్‌లో వచ్చారు.

Rahul Gandhi: అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
Rahul Gandhi

రాంచీ: కేంద్రం హోం మంత్రి అమిత్‌షా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జార్ఖాండ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ స్వయంగా చాయిబాసా కోర్టు ముందు బుధవారంనాడు హాజరయ్యారు.


కోర్టు చుట్టూ భారీ భద్రత

దీనికి ముందు, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కోర్టు చుట్టూ భద్రతను పెంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. రాంచీ నుంచి చాయిబాసాకు రాహుల్ హెలికాప్టర్‌లో వచ్చారు. ఇందుకోసం టాటా కాలేజీ గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాహుల్ మంగళవారంనాడు రాష్ట్రానికి వచ్చారు.


రాహుల్‌పై కేసు ఏమిటంటే..

రాహుల్ గాంధీ 2018లో జరిగిన ఒక ర్యాలీలో అమిత్‌‌షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువునష్టం కేసు వేశారు. జూన్ 26న ప్రత్యేక కోర్టు ముందు రాహుల్ హాజరు కావాల్సి ఉండగా ఆయన తరఫు న్యాయవాది తన క్లయింట్ ఆరోజు హాజరుకాలేరని, ఆగస్టు 6వ తేదీని హాజరయ్యేందుకు వీలు కల్పించాలని కోర్టును కోరారు.


ఇవి కూడా చదవండి..

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మార్చి తర్వాత భారీగా పరిశ్రమలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 02:56 PM