ED Investigation: ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరు
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:01 AM
నీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ
న్యూఢిల్లీ, ఆగస్టు 5: మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ (66) మంగళవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉదయం 10.50 నిమిషాలకు ఆయన విద్యుత్తు వాహనంలో ఈడీ కార్యాలయానికి వచ్చారు. వివిధ బ్యాంకుల నుంచి తన గ్రూపులోని కొన్ని కంపెనీల పేరున తీసుకున్న రూ.17వేల కోట్ల రుణాలను అదే గ్రూపులోని మరికొన్ని కంపెనీలకు మళ్లించారంటూ నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎల్‌ఎంఏ) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.