Home » ED raids
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లో సెంట్రిక్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో జగన్ మీడియా ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా నోట్ల కట్టలతో నిండిన సంచులు దొరికినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టవర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సోదాలు చేస్తుండగా.. రూ.500 నోట్లతో నిండిన రెండు సంచులను తొమ్మిదో అంతస్తు నుంచి పడేసినట్లు సమాచారం.
తిరుపతిలో ఈడీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటలో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
టీఎంసీ సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్‌కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది.
కోల్‌కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను ఈడీ శుక్రవారంనాడు ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి కేంద్రీకరించింది. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
ఫ్లాట్లు, విల్లాల పేరిట వందల కోట్లు వసూలు చేసి సొంతానికి వాడుకున్న కేసులో సాహితి ఇన్‌ఫ్రా గ్రూపు ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.పూర్ణచంద్ర రావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
ఈడీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడానికి వస్తున్నారని తెలిసి పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించారు.