ED investigation: సాహితి ఇన్‌ఫ్రా ఫైనాన్స్ డైరెక్టర్‌ను అరెస్టు చేసిన ఈడీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:46 AM
ఫ్లాట్లు, విల్లాల పేరిట వందల కోట్లు వసూలు చేసి సొంతానికి వాడుకున్న కేసులో సాహితి ఇన్‌ఫ్రా గ్రూపు ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.పూర్ణచంద్ర రావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఫ్లాట్లు, విల్లాల పేరిట వందల కోట్లు వసూలు చేసి సొంతానికి వాడుకున్న కేసులో సాహితి ఇన్‌ఫ్రా గ్రూపు ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.పూర్ణచంద్ర రావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. పూర్ణచంద్ర రావును మంగళవారం కోర్టులో హాజరుపరిచామని, న్యాయస్థానం అతడ్ని 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చిందని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సాహితి ఇన్‌ఫ్రా కేసులో ఇటీవలే కంపెనీ యజమాని లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లక్ష్మీనారాయణతో కలిసి పూర్ణచంద్రరావు వందలకోట్ల మోసానికి పాల్పడ్డారని, బాఽధితులు చెల్లించిన రూ.కోట్లను నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టకుండా సొంతానికి వాడుకున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.