Industrial Security: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మార్చి తర్వాత భారీగా పరిశ్రమలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:54 AM
సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సంఖ్యను మరో 20 వేల మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఐఎ్‌సఎఫ్ సంఖ్య 2.20 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ, ఆగస్టు 5: సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సంఖ్యను మరో 20 వేల మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్యను 2.20 లక్షలకు పెంచనున్నట్లు హోంశాఖ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2026 మార్చి తర్వాత రాబోయే పరిశ్రమలకు, విమానాశ్రయాలు, పోర్టులు వంటి కీలక రంగాలకు భద్రత పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో, సులువైన విధులు ఉండే చోట పనిచేస్తున్న సిబ్బందిని క్రమం తప్పకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని కూడా హోంశాఖ ఆదేశించింది. కాగా, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతంచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖనిజ వనరులు అధికంగా లభించే ఛత్తీ్‌సగఢ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులను అంతం చేసి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.