Home » Jharkhand
వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిరువురూ యోగా శిక్షకులుగా అక్కడ విధులు నిర్వహిస్తుండేవారు.
జార్ఖండ్ మంత్రి, జేఎమ్ఎమ్ సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
రక్షాబంధన్ సందర్భంగా జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రజలు సుమారు లక్ష చెట్లకు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రకృతిని నిత్యం పరిరక్షిస్తామని హామీ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ 19 ఏళ్ల యువతికి జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. రైల్వే ట్రాక్ సమీపంలో స్నేహితులతో కలిసి రీల్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులను కోల్పోయింది.
ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారాల తరబడి సాగిన విద్యార్థుల నిరసనలు ముగిశాయని ఊపిరి తీసుకునేలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. 2014 నుంచి ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్సీ) ద్వారా నియమితులైన ఉద్యోగులంతా రోడ్లెక్కారు.
జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను ఝార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని వారాలుగా చేస్తున్న నిరాహార దీక్షను ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో విరమించారు. మహతోతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్షను విరమిస్తున్నట్లు మహతో ప్రకటించారు.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఝార్ఖండ్‌లో గురువారం విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు 600 మందిపై కేసు నమోదు చేశారు.
జార్ఖండ్‌లో జరిగిన SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు.
రాంచీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీకి అడ్డంకులు సృష్టించిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.