CO Caught Red Handed: ప్రియురాలితో ఏకాంతంగా భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:29 PM
ఓ ప్రభుత్వ అధికారి ప్రియురాలితో ఇంట్లో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి భార్యను కాదని మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. గవర్నమెంట్ క్వాటర్స్‌లో ప్రియురాలితో ఉండగా అడ్డంగా భార్యకు దొరికిపోయాడు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గర్హ్‌వా జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం బిహార్‌కు చెందిన మాజీ ఎంపీ రాంజీ మంజీ కూతురు శ్యామ రాణితో పెళ్లైంది.
వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రమోద్ గత కొంత కాలంనుంచి భార్యతో ప్రేమగా ఉండటం లేదు. సరిగా ఇంటికి రావటం కూడా మానేశాడు. అతడి ప్రవర్తనపై శ్యామ రాణికి అనుమానం వచ్చింది. శనివారం తెల్లవారు జామున ప్రమోద్ కోసం ప్రభుత్వం కేటాయించిన క్వాటర్స్‌కు వెళ్లింది. అక్కడ ఓ గదిలో ప్రమోద్ ప్రియురాలితో కలిసి నిద్రపోతూ ఉన్నాడు. భర్తను అలా చూసి శ్యామ రాణి ఎంతో బాధపడింది. వెంటనే బయటకు వచ్చింది.
బయటి నుంచి ఆ ఇంటి తలుపు గడియ పెట్టింది. నిద్ర మేల్కొన్న ప్రమోద్ తలుపు తీయమని భార్యను బతిమాలుకున్నాడు. ఆమె అతడి మాటలు వినలేదు. అతడు బెదిరించినా కూడా లెక్కపెట్టలేదు. ఉదయం పెద్ద ఎత్తున జనం ఆ ఇంటి దగ్గర మూగారు. దీంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ప్రమోద్ కిటికీలోంచి బయటకు దూకి పారిపోయాడు. పోలీసులు అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు
భారత్ స్వీట్లకు పాక్‌లో భారీ డిమాండ్.. సోన్‌పాప్డి ఖరీదు ఎంతో తెలిస్తే..