Indian sweets in Pakistan: భారత్ స్వీట్లకు పాక్‌లో భారీ డిమాండ్.. సోన్‌పాప్డి ఖరీదు ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:43 PM
భారత్‌లో తయారయ్యే స్వీట్లు, ఇతర తినుబండారాలకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశపు స్వీట్లను పాకిస్థానీలు చాలా ఇష్టంగా తింటారు. హల్దీరామ్స్ వంటి కంపెనీలు తయారు చేసే స్వీట్లు ఎంత ఖరీదైనా వాటిని కొనుక్కుని తింటుంటారు.
భారత్‌లో తయారయ్యే స్వీట్లు, ఇతర తినుబండారాలకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశపు స్వీట్లను పాకిస్థానీలు చాలా ఇష్టంగా తింటారు. హల్దీరామ్స్ వంటి కంపెనీలు తయారు చేసే స్వీట్లు ఎంత ఖరీదైనా వాటిని కొనుక్కుని తింటుంటారు. తాజాగా పాకిస్థాన్‌లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారత్‌లో తయారైన సోన్‌పాప్డి (Son Papdi in Pakistan) గురించి దుకాణదారుడిని ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నారు.
'నేను సోన్‌పాప్డి అనే పేరు వినడం ఇదే మొదటిసారి. అది ఏమిటి?' అని దుకాణదారుడిని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీంతో ఆ దుకాణదారుడు నవ్వుతూ, 'ఇది భారతదేశం నుంచి వచ్చిన మిఠాయి. హల్దిరామ్ తయారు చేసే సోన్ పాప్డి. ఇది ఇక్కడ చాలా ఫేమస్. ప్రజలు దీనిని చాలా ఇష్టపడతారు' అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ స్వీట్ ధర గురించి ప్రశ్నించారు. దానికి అతడు స్పందిస్తూ.. 'భారతదేశంలో దీని ధర 210 రూపాయలు. కానీ ఇక్కడ పాకిస్థాన్‌లో 1300 రూపాయలకు అమ్ముడవుతోంది' అని చెప్పారు (Son Papdi price in Pak).
పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది (India Pakistan news). అక్కడి నిత్యావసరాల రేట్లన్నీ భారీగా పెరిగిపోయాయి. అక్కడ ఉత్పత్తి లేకపోవడంతో ఆ దేశం చాలా వస్తువులను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు చాలా వరకు భారత్ నుంచే పాకిస్థాన్‌కు దిగుమతి అవుతుంటాయి. మనదేశంలో పూర్తిగా దేశీ నెయ్యితో తయారైన హల్దీరామ్ ఉత్పత్తులకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇతడి తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే.. ట్రాఫిక్ చలానా తప్పించుకునేందుకు సూపర్ ట్రిక్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ Qల మధ్యనున్న Oను 9 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..