Share News

Viral funny video: ఇతడి తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే.. ట్రాఫిక్ చలానా తప్పించుకునేందుకు సూపర్ ట్రిక్..

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:47 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బైక్ మీద ప్రయాణించే ఇద్దరు వ్యక్తులూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ నిబంధనను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

Viral funny video: ఇతడి తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే.. ట్రాఫిక్ చలానా తప్పించుకునేందుకు సూపర్ ట్రిక్..
funny helmet

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బైక్ మీద ప్రయాణించే ఇద్దరు వ్యక్తులూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ నిబంధనను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్లు తీసుకెళ్లకపోవడం అనేది తరచుగా జరుగుతుంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు (funny traffic video).


తాజాగా బెంగళూరులోని ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి ఉపయోగించిన హెల్మెట్ చూస్తే పొట్ట పగిలేలా నవ్వుకోవడం ఖాయం. @karnatakaportf అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బైక్ మీద వెనుక కూర్చున్న ఓ వ్యక్తి తన తలపై హెల్మెట్‌కు బదులుగా వంటలో ఉపయోగించే మూకుడును పెట్టుకున్నాడు (frying pan helmet). బెంగళూరులో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి తన తలపై ఫ్రైయింగ్ పాన్‌ పెట్టుకుని ఉండటం చూసి, సమీపంలో ఉన్న వ్యక్తులు దానిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు (Viral Video).


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (hilarious moments). ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 3.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు 1900 మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'ఫ్రైయింగ్ పాన్‌ ఉండాల్సింది వంటగదిలో, మీ తలపై కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి తెలివితేటలు చూపిస్తే ప్రాణాలకు ప్రమాదం అని మరొకరు హెచ్చరించారు. ఇది బడ్జెట్‌లో లభించే గొప్ప భారతీయ ఆవిష్కరణ అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2025 | 02:47 PM