Sleeper bus safety: స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:48 PM
ఇటీవలి కాలంలో మన దేశంలో స్లీపర్ బస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లీపర్ బస్‌లు అగ్ని ప్రమాదాలకు గురి కావడం, అందులోని ప్రయాణికులు మంటలకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది.
ఇటీవలి కాలంలో మన దేశంలో స్లీపర్ బస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లీపర్ బస్‌లు అగ్ని ప్రమాదాలకు గురి కావడం, అందులోని ప్రయాణికులు మంటలకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్ ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోవడం తీవ్ర దుమారం రేపింది (sleeper bus safety).
స్లీపర్ బస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది (bus safety instructions). బస్సుల్లోని భద్రతా చర్యల గురించి క్షుణ్నంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బస్ ఆపరేటర్లు కూడా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒకవేళ బస్ అగ్ని ప్రమదానికి గురైతే ఎలా బయటపడాలో ముందుగానే ప్రయాణికులకు చెబుతున్నారు. అలాంటి రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్లీపర్ బస్ ఎక్కే ప్రయాణికులు ఒకవేళ ప్రమాదం జరిగితే బయట పడే మార్గాల గురించి ముందే డ్రైవర్‌ను లేదా సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి