Share News

Old Man Viral Video: పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Oct 22 , 2025 | 03:55 PM

రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో గానీ.. ఓ పెద్దాయన విచిత్రంగా పట్టాలపై కూర్చున్నాడు. దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది. అయినా ఆ పెద్దాయన పైకి లేవకుండా అలాగే ఉన్నాడు. ఆ రైలు తీరా సమీపానికి రాగానే..

Old Man Viral Video: పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

కొందరికి వయసు పెరుగుతున్నా కూడా చిన్న పిల్లల తరహాలో ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు వృద్ధులు లేటు వయసులో యువకుల తరహాలో స్టంట్స్ చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు వృద్ధులు ప్రాణం అంచుల దాకా వెళ్లి.. అదృష్టవశాత్తు చివరకు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దాయన రైలు పట్టాలపై కూర్చున్నాడు. అదే సమయంలో ఓ రైలు అటుగా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో గానీ.. ఓ పెద్దాయన విచిత్రంగా (Old man sitting on train tracks) పట్టాలపై కూర్చున్నాడు. దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది. అయినా ఆ పెద్దాయన పైకి లేవకుండా అలాగే ఉన్నాడు. ఆ రైలు తీరా సమీపానికి రాగానే.. ఒక్కసారిగా పైకి లేచాడు. తీరా ఢీకొంటుందనగా.. ఆ పెద్దాయన ఒక్క ఉదుటున పైకి లేచి, ప్లాట్‌ఫామ్ మీదకు ఎక్కేశాడు.


ఈ క్రమంలో ఒక్క క్షణం ఆలస్యమైనా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కావాలని చేశాడో.. లేక అనుకోకుండా ఇలా జరిగిందో గానీ.. ఈ పెద్దాయన చేసిన పని మాత్రం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురి చేసింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారంతా ఈ సీన్ చూసి ఖంగుతిన్నారు. వారిలో కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పెద్దాయన యమరాజుతో కలిసి భోజనం చేయాలని అనుకున్నాడేమో’.. అంటూ కొందరు, ‘జీవితం మీద బోర్ కొట్టి అలా చేశాడు.. అయితే చివర్లో సత్యం గ్రహించి మనసు మార్చుకున్నాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 35 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..

రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 04:08 PM