Theft Viral Video: నిద్రపోతున్న వ్యక్తి పర్సు కొట్టేస్తున్న దొంగ.. దూరం నుంచి వీడియో తీస్తున్న వ్యక్తి.. చివరకు..
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:58 AM
ఓ యువకుడు రోడ్డు పక్కన బస్ స్టాప్‌లోని బెంచిపై పడుకుని నిద్రపోతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ దొంగ.. మెల్లగా అతడి జేబులోని పర్సు కొట్టేందుకు ప్రయత్నించాడు. అతడికి అనుమానం రాకుండా పర్సును మెల్లిగా బయటికి లాగేస్తున్నాడు. అయితే ఇదంతా..
దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. కొందరు మహిళల మెడలో బంగారు చైన్లు లాక్కుని పారిపోతుంటే.. మరికొందరు మన పక్కనే ఉంటూ మనకు తెలీకుండానే జేబులో డబ్బులు కొట్టేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా కత్తులతో బెదిరించి మరీ దోపిడీ చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రోడ్డు పక్కన బస్ స్టాప్‌లో పడుకుని నిద్రపోతున్నాడు. అతన్ని గమనించిన ఓ దొంగ పర్సు కొట్టేందుకు ప్రయత్నించాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పూణేలో (Pune) చోటు చేసుకుంది. ఓ యువకుడు రోడ్డు పక్కన బస్ స్టాప్‌లోని బెంచిపై పడుకుని నిద్రపోతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ దొంగ.. మెల్లగా అతడి జేబులోని (Thief Snatching Sleeping Man Wallet) పర్సు కొట్టేందుకు ప్రయత్నించాడు. అతడికి అనుమానం రాకుండా పర్సును మెల్లిగా బయటికి లాగేస్తున్నాడు. అయితే ఇదంతా.. ఓ వ్యక్తి దూరం నుంచి గమనిస్తున్నాడు.
తన ఫోన్ బయటికి తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే కాసేపటి తర్వాత ఆ దొంగ.. అతన్ని గమనించాడు. వీడియో తీయడం చూసి కోపంగా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తన జేబులోని కత్తిని బయటికి తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతటితో వీడియో ముగుస్తుంది. అయితే వీడియోలో తెలిపిన ప్రకారం.. దొంగ వీడియో తీస్తున్న వ్యక్తిని పొడిచే (Thief Attempted to attack) ప్రయత్నం చేశాడు. దీంతో అతను పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే ఆ తర్వాత ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలి’.. అంటూ కొందరు, ‘దొంగతనం కాకుండా కెమెరామెన్ ఆపగలిగాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి