Share News

Car Accident Video: వామ్మో.. ఘోర రోడ్డు ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. చివరకు..

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:38 PM

వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో..

Car Accident Video: వామ్మో.. ఘోర రోడ్డు ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు.. చివరకు..

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే చాలా వరకు ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు ఊహించని సంభవిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ప్రాణ నష్టం ఎక్కువగా జరిగితే.. మరికొన్నిసార్లు అదృష్టం బాగుండి గాయాలతో బయటపడుతుంటారు. తాజాగా, ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు నడి రోడ్డుపై పల్టీలు కొట్టింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని (Tamil Nadu) తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ చాలా దూరం వరకూ దూసుకెళ్లింది.


ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. కారు చాలా దూరం వరకూ (car accident) ఈడ్చుకుంటూ వెళ్లి ఆగింది. ఈ ప్రమాద ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతా పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అయితే రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని వదిలేసి, అంతా కారు వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీడియోలో తెలిపిన ప్రకారం.. కారు డ్రైవర్‌తో పాటూ రోడ్డుపై పడిపోయిన వ్యక్తి గాయపడ్డారని తెలుస్తోంది.


అయితే పరిస్థితి చూస్తుంటే ఎగిరి పడిపోయిన వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అర్థమవుతోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కారు టైరు పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది’.. అంటూ కొందరు, ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 750కి పైగా లైక్‌లు, 1.52 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

కోళ్ల తరహాలో తేళ్ల పెంపకం.. లీటర్ విషం ధర ఎంతో తెలిస్తే..

ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2025 | 03:38 PM