Train Funny Video: ఎంతకీ తెరుచుకోని రైలు బాత్రూం.. అనుమానంతో బద్దలు కొట్టి చూడగా.. లోపల ఫన్నీ సీన్..
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:22 PM
రన్నింగ్ రైల్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. బోగీలోని ప్రయాణికులు బాత్రూం వెళ్లాలని చూడగా.. డోరు లాక్ చేసింది ఉంది. దీంతో కొద్ది సేపు ఎదరు చూశారు. అయినా డోరు తెరుచుకోలేదు. దీంతో మరింత సమయం వేచి చూశారు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా ఆ డోరు మాత్రం తెరుచుకోలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
రైలుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. రైల్లో విచిత్ర విన్యాసాలు చేయడం, రైలుపై బోగీలపై రీల్స్ చేయడం, డోరు వద్ద వేలాడుతూ స్టంట్స్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, రైలు బాత్‌రూంలో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎంతకీ బాత్రూం డోరు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. చివరకు వారు డోరు తెరచిచూడగా.. ఫన్నీ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రన్నింగ్ రైల్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. బోగీలోని ప్రయాణికులు బాత్రూం వెళ్లాలని చూడగా.. డోరు లాక్ చేసింది ఉంది. దీంతో కొద్ది సేపు ఎదరు చూశారు. అయినా డోరు తెరుచుకోలేదు. దీంతో మరింత సమయం వేచి చూశారు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా ఆ డోరు మాత్రం తెరుచుకోలేదు. చివరకు 6 గంటలవుతున్నా కూడా డోరు తెరవలేదు. దీంతో చివరకు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న సిబ్బంది.. డోరు తట్టి చూశారు. అయినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో వారు స్కూడ్రైవర్, ఇనుప రాడ్లు తీసుకుని డోరును తెరిచేందుకు ప్రయత్నించారు. డోరు తెరిచేందుకు ప్రయత్నించే క్రమంలో చివరకు ఎట్టకేలకు డోర్ తెరుచుకుంది. తీరా చూస్తే లోపల (old man sleeping in train bathroom) ఓ వృద్ధుడు హాయిగా నిద్రపోతున్నట్లు తెలిసింది. ఈ శబ్దాలకు నిద్రలేచని ఆ వ్యక్తి.. తాపీగా డోరు తీసి బయటికి వచ్చేశాడు. అతన్ని చూడగానే ప్రయాణికులతో పాటూ సిబ్బంది మొత్తం అవాక్కయ్యారు.
అతడు చేసిన పనిని వీడియో తీసిన సిబ్బంది.. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఎక్కడ జరిగిందో ఏమో గానీ.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పెద్దాయన మామూలు షాక్ ఇవ్వలేదుగా’.. అంటూ కొందరు, ‘టికెట్ నుంచి తప్పించుకోవడానికి మంచి ప్లేస్ ఎంచుకున్నాడు’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 1.42 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి