Hospital Viral Video: ఆస్పత్రి భవనంలో షాకింగ్ ఘటన.. ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గాయాలు.. ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:46 PM
ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఆపరేషన్ మధ్యలో సడన్‌గా కాస్త దూరంలో పైకప్పు పెచ్చులూడి కిందపడిపోయింది. పెద్ద పెద్ద సిమెంట్ పలకలు ఊడి పడడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆపరేషన్ చేసే సమయంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తీరా ఆపరేషన్ చేస్తుండగా కరెంట్ పోవడం, ఆపరేషన్ థియేటర్‌లోకి ఎలుకలు, పిల్లులు వంటివి రావడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేస్తుండగా.. అనూహ్య ఘటన జరిగి వైద్యుడు గాయపడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బిహార్ పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఆపరేషన్ మధ్యలో సడన్‌గా కాస్త దూరంలో (Building Roof collapsed) పైకప్పు పెచ్చులూడి కిందపడిపోయింది. పెద్ద పెద్ద సిమెంట్ పలకలు ఊడి పడడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెచ్చులు ఎగిరి వచ్చి వైద్యుడి కాళ్లపై పడడంతో గాయాలయ్యాయి.
అలాగే ఈ ఘటనలో మరో నర్సు కూడా (Doctor and nurse were injured) గాయపడింది. దీంతో వారంతా కాసేపు భయాందోళనకు గురయ్యారు. వారిలో కొందరు సిబ్బంది ఈ ఘటనను వీడియో తీశారు. ఆపరేషన్ చేస్తున్న సర్జన్.. ఈ ప్రమాద ఘటనను వివరిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆపరేషన్ ఎలా చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలమైన మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ.. అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’.. అంటూ కొందరు, ‘ఒకవేళ పైకప్పు మొత్తం కూలి ఉంటే పరిస్థితి ఏంటి.. ఇలాంటి భవనాలను వెంటనే మార్చాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ దున్న వెరీ లక్కీ.. సింహాల నుంచి ఎలా తప్పించుకుందో చూస్తే..
జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి