Share News

Snake Swimming With Fish: ఈ పాము మరీ విచిత్రంగా ఉందే.. చేపను పట్టుకుని మరీ..

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:04 AM

ఓ పాము నీటిలో ఈత కొడుతోంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. పాము ఈత కొట్టడంలో విశేషమేమీ లేకున్నా.. పాము తన నోటితో చేపను పట్టుకుని ఈత కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

Snake Swimming With Fish: ఈ పాము మరీ విచిత్రంగా ఉందే.. చేపను పట్టుకుని మరీ..

శత్రువులను చూడగానే కాటేసే పాములు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కాటేయాల్సిన పాములు.. కొన్నిసార్లు కామ్‌గా ఉండిపోవడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు మరీ విచిత్రంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పాము చేపను పట్టుకుని ఈత కొట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఈ పాము మరీ విచిత్రంగా ఉందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము నీటిలో ఈత కొడుతోంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. పాము ఈత కొట్టడంలో విశేషమేమీ లేకున్నా.. పాము తన నోటితో చేపను పట్టుకుని ఈత కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


చేపను నోటితో పట్టుకున్న పాము.. (Snake Swimming in Water Holding Fish in its Mouth) మెలికలు తిరుగుతూ నీటిలో దూసుకెళ్లిపోతుంది. ఇలా చాలా దూరం వరకూ అలా చేపను పట్టుకునే వెళ్తుంది. ఆ సమయంలో చేపలో ఎలాంటి చలనం కనిపించదు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పాము మరీ విచిత్రంగా ఉందే’.. అంటూ కొందరు, ‘చేపలంటే ఈ పాముకు బాగా ఇష్టమున్నట్లుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 8.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 11:24 AM