Share News

Little Boy Viral Video: జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:04 AM

జోగాడే ఓ చంటి పిల్లాడు.. ఇంటి మేడపై బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బుడ్డోడు జోగాడుకుంటూ ఇనుప రెయిలింగ్ వద్దకు చేరుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Little Boy Viral Video: జోగాడే పిల్లలే కదా అని బాల్కనీలో వదిలేస్తున్నారా..

పెద్దల నిర్లక్ష్యం కొన్నిసార్లు పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. పసి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఆడుకుంటూ గుంటల్లో పడిపోవడం, ఇళ్లపై నుంచి కిందకు పడడం, కరెంట్ వైర్లను ముట్టుకోవడం, వివిధ వస్తువులను మింగడం వంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాల్కనీలో ఉన్న ఓ పిల్లాడు జోగాడుకుంటూ రెయిలింగ్ వద్దకు చేరుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జోగాడే ఓ చంటి పిల్లాడు.. (Child Crawling on Balcony) ఇంటి మేడపై బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బుడ్డోడు జోగాడుకుంటూ ఇనుప రెయిలింగ్ వద్దకు చేరుకున్నాడు. తర్వాత ఇనుప (child climbed balcony railing) కడ్డీలను పట్టుకుని పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు.


అయితే ఆ సమయంలో పిల్లాడిని వీడియో తీస్తున్న వ్యక్తి.. వెళ్లి పట్టుకుని కిందకు దించుతాడు. పిల్లలను చూడకుండా వదిలేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చూపించేందుకు.. ఇదంతా కావాలని వీడియో తీసినా కూడా ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. నిజంగా ఆ సమయంలో పెద్దలు ఎవరూ లేకపోయి ఉంటే.. పిల్లాడు ఆ రెయిలింగ్ పైనుంచి కిందపడే ప్రమాదం ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. పిల్లలను బాల్కనీలో వదిలేస్తే ఎంత ప్రమాదం’.. అంటూ కొందరు, ‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లు, 6.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

క్రీమ్ అయిపోయిందని ట్యూబ్ పడేస్తున్నారా.. ఈమె వాడిన ట్రిక్ చూస్తే అవాక్కవుతారు..

ప్రియురాలి ముందు పవర్ చూపించాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 08:04 AM