Share News

Optical illusion: మీ కంటి చూపు బాగుంటే తప్ప.. ఈ చిత్రంలో దాక్కున్న పియర్ పండును గుర్తించలేరు..

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:36 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో జూలో నాలుగు పెద్ద జిరాఫీలు , ఒక చిన్న జిరాఫీ గడ్డి మేత మేస్తుంటాయి. అక్కడే ఉన్న గోడపై నుంచి కొందరు పర్యాటకులు వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ పియర్ పండు దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..

Optical illusion: మీ కంటి చూపు బాగుంటే తప్ప.. ఈ చిత్రంలో దాక్కున్న పియర్ పండును గుర్తించలేరు..

మన కళ్లకు పరీక్ష పెట్టే అనేక ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని పజిల్స్ పరిష్కరించలేని విధంగా ఉంటాయి. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి, మానసికోళ్లాసం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మీ ముందుకు రోజూ చాలా పజిల్స్ చిత్రాలను తీసుకొస్తున్నాం. తాజాగా, ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్ర్నని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పియర్ పండు దాక్కుని ఉంది. దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో జూలో నాలుగు పెద్ద జిరాఫీలు (Giraffes), ఒక చిన్న జిరాఫీ గడ్డి మేత మేస్తుంటాయి. అక్కడే ఉన్న గోడపై నుంచి కొందరు పర్యాటకులు వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు.


అలాగే కాస్త దూరంలో ఓ పిల్లాడు.. పెద్ద జిరాఫీకి ఆహారం తినిపిస్తుంటాడు. వారి వెనుక రెండు పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. అదేవిధంగా ఆ చెట్టుపై ఓ చిలుక కూడా ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (hidden pear) ఓ పియర్ పండు కూడా దాక్కుని ఉంది.


అయితే ఆ పండును గుర్తించడం అంత సులభం కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఆ పండును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ పండును గుర్తించగలుతున్నారు.


ఇంకెందుకు ఆలస్యం ఆ పియర్ పండు ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ పండును గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Sep 24 , 2025 | 01:40 PM