Share News

Optical illusion: నిజంగా మీ చూపు చురుగ్గా ఉంటే.. ఇందులో దాక్కున్న 5 బుక్స్‌ను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం...

ABN , Publish Date - Sep 19 , 2025 | 03:30 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ యువకుడు, యువతి పచ్చని గడ్డిపై కూర్చున్నారు. వారి వెనుకే ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. అలాగే చాలా చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇదే చిత్రంలో మొత్తం 5 పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం..

Optical illusion: నిజంగా మీ చూపు చురుగ్గా ఉంటే..  ఇందులో దాక్కున్న 5 బుక్స్‌ను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం...

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మిగతా చిత్రాల్లాగా సాధారణంగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. వాటిని గుర్తించడం కొన్నిసార్లు ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే వాటిని గుర్తించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. గతంలో మీ ముందుకు అనేక ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలను తీసుకొచ్చాం. అయితే తాజాగా ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇందులో దాక్కున్న 5 పుస్తకాలను గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ యువకుడు, యువతి పచ్చని గడ్డిపై కూర్చున్నారు. యువకుడు పుస్తకం చదువుతుండగా.. యువతి ఫోన్ పట్టుకుని అతడితో మాట్లాడుతూ ఉంటుంది.


యువతి, యువకుడి పక్కనే ఓ బుట్టలో వివిధ రకాల వస్తువులు ఉంటాయి. అలాగే ఆ పక్కనే ప్లేటులో ఆహార పదార్థాలు, పక్కనే నీళ్ల మగ్ కూడా ఉంటుంది. వారి వెనుక ఓ పూల మొక్కతో పాటూ పెద్ద చెట్టు ఉంటుంది. ఆ పక్కనే టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి ఇంకా దూరంగా పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు కూడా కనిపిస్తాయి. ఇంతవరకూ అంతా బాగుంది కానీ.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం.


ఈ చిత్రంలో మొత్తం 5 పుస్తకాలు ఉన్నాయి. కానీ పైకి మాత్రం యువకుడి చేతిలోని పుస్తకమే కనిపిస్తుంది. ఇంకా నాలుగు పుస్తకాలు (Hidden books) ఇందులో దాగి ఉన్నాయి. వాటిని కనుక్కుకనేందుకు ప్రయత్నించండి. పది మంది ప్రయత్నిస్తుంటే.. అందులో ముగ్గురు మాత్రమే సమాధానాన్ని చెప్పగలిగారు.


ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ 5 పుస్తకాలను గుర్తించలేకపోతే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Sep 19 , 2025 | 03:35 PM