Watch Viral Video: పడుకుందామని వెళ్లాడు.. చివరకు దుప్పటి లోపల చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:19 PM
ఓ వ్యక్తి పడుకోవడానికి మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే సమయంలో అతడికి బెడ్‌షీట్ చూసి సందేహం కలుగుతుంది. దీంతో చివరకు దుప్పటి పైకి ఎత్తి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
ఇళ్లలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా ఏవేవో కనిపిస్తుంటాయి. ఉన్నట్టుండి బయటికి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హాయిగా పడుకుందామని మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా దుప్పటి తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పడుకోవడానికి మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే సమయంలో అతడికి బెడ్‌షీట్ చూసి సందేహం కలుగుతుంది. దీంతో దుప్పటిని మెల్లిగా పైకి ఎత్తాడు. ఇంకేముందీ.. లోపల ఓ పాము (Snake hiding in blanket) అటూ, ఇటూ కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది. అయితే ముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చలికాలంలో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా చూస్తుంటాం. ఇళ్లల్లోకి ప్రవేశించే పాములు.. మంచాల కింద, గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్‌లు, కూలర్ల మాటున దాగి ఉండడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి.
తాజాగా, దుప్పట్లో కనిపించిన పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా పరిశీలించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లు, 84 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అంబానీ టాయిలెట్ కూడా ఇలా ఉండదేమో.. లోపల ఏర్పాట్లు చూస్తే..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి