Watch Viral Video: ఏది పడితే అది చేస్తే ఇలాగే అవుతుంది.. జుట్టును ఎలా కత్తిరిస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Sep 12 , 2025 | 09:40 AM
ఓ సెలూన్‌లో ఓ యువతి చైర్‌లో కూర్చుని ఉండగా.. అక్కడున్న వ్యక్తి ఆమెకు హెయిర్ కట్ చేసేందుకు అక్కడికి వచ్చాడు. అయితే అందరిలా కాకుండా ఆమె జుట్టును మార్బుల్స్‌ను కట్ చేసే మిషిన్‌తో కత్తిరించాలని చూశాడు. చివరికి ఏమైందో చూడండి..
కొందరు వ్యూస్ కోసం, మరికొందరు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. ఇంకొందరైతే వైరల్ వీడియోలు చూసి.. తామూ అలాగే చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. జుట్టును విచిత్రంగా కత్తిరించాలని చూడగా చివరకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ సెలూన్‌లో ఓ యువతి చైర్‌లో కూర్చుని ఉండగా.. అక్కడున్న ఓ వ్యక్తి ఆమెకు హెయిర్ కట్ చేసేందుకు వచ్చాడు. అయితే అందరిలా కాకుండా ఆమె జుట్టును మార్బుల్ కటింగ్ మిషిన్‌తో కత్తిరించాలని చూశాడు. మిషిన్‌ను ఆన్ చేసి ఆమె జుట్టును కట్ చేసేందుకు మెల్లిగా దగ్గరకు తీసుకొచ్చాడు.
అయితే మిషిన్ బ్లేడ్ వెంట్రుకలను టచ్ అవగానే.. (man cut young woman hair with cutting machine) జుట్టు మొత్తం ఒక్కసారిగా మిషిన్‌లో ఇరుక్కుపోతుంది. దీంతో ఆ యువతి కెవ్ మంటూ కేకలు పెడుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇలా వారు ఏదో అనుకుంటే.. చివరకు ఇంకేదో జరిగిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కటింగ్ చేసే వ్యక్తి .. వడ్రంగిగా మారితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘ప్రపంచం మొత్తం పిచ్చివాళ్లతో నిండిపోయింది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 118కి పైగా లైక్‌లు, 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.