Woman Catching Thief: బ్రూస్‌లీని మించిపోయిందిగా.. చోరీ చేయబోతున్న దొంగను ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:04 AM
ఓ దుకాణంలో యువతి క్యాష్ కౌంటర్ టేబుల్ దగ్గర నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడే కాస్త దూరంలో నిలబడి ఉన్న యువకుడు.. చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. యువతి కావడంతో ఏమీ చేయలేదనే ఉద్దేశంతో నేరుగా వెళ్లి.. యువతి పక్కనే టేబుల్‌పై ఉన్న..
చోరీల సమయంలో చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు దొరక్కుండా చోరీ చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంటుంది. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ యువతి ఉండగానే చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణంలో యువతి క్యాష్ కౌంటర్ టేబుల్ దగ్గర నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడే కాస్త దూరంలో నిలబడి ఉన్న యువకుడు.. చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. యువతి కావడంతో ఏమీ చేయలేదనే ఉద్దేశంతో నేరుగా వెళ్లి.. యువతి పక్కనే టేబుల్‌పై ఉన్న వస్తువును తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అయితే వెంటనే అప్రమత్తమై యువతి.. ఆ దొంగను పట్టుకుని కిందపడేస్తుంది. ఆమె నుంచి విడిపించుకోవడానికి అతను ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఆమె అరుపులకు అక్కడే ఉన్న ఓ వ్యక్తి, ఇంకో యువతి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వ్యక్తి దొంగను పక్కకు లాగేయాలని చూశాడు. ఆ యువతి మాత్రం అతన్ని వదలకుండా మీద కూర్చుని మరీ చెంపచెల్లుమనిస్తుంది. మధ్యలో మధ్యలో పిడి గుద్దులు గుద్దుతూ చుక్కలు చూపిస్తుంది.
ఆమె దెబ్బలు తాళలేక దొంగ కుయ్యో.. ముర్రో అని అరవడం స్టార్ట్ చేశాడు. ఇలా ఆ యువతి చాలా సేపు ఆ దొంగను చితకబాదుతూనే ఉంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘దొంగకు చుక్కలు చూపించిన యువతి’.. అంటూ కొందరు, ‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 360కి పైగా లైక్‌లు, 58 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. పెళ్లి ఊరేగింపులో ఈ మహిళల నిర్వాకం చూస్తే..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి