Cooking Viral Video: పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:01 PM
ఓ మహిళ పూరీలు చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇందులో విశేషమేమీ లేకున్నా పూరీలు చేసిన విధానమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
వంట చేయడంలో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అలాగే కొందరు అందరిలా కాకుండా వింత వింత ట్రిక్స్ వాడుతూ వంట చేస్తుంటారు. ఇంకొందరు పెద్ద పెద్ద సమస్యలకు సైతం చిన్న చిన్న చిట్కాలతో పరిష్కారాలు చూపుతుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పూరీలు చేసే విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇలాంటి పూరీలు..నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పూరీలు చేసేందుకు (Woman making puris) అన్నీ సిద్ధం చేసుకుంది. ఇందులో విశేషమేమీ లేకున్నా పూరీలు చేసిన విధానమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా పూరీలకు నూనె అంటుకోవడం సర్వసాధారణం. దీంతో చాలా మంది వీటిని తినేందుకు ఆలోచిస్తుంటారు.
నూనెను తొలగించేందుకు పూరీలను కాగితంపై ప్రెస్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమస్య లేకుండా.. ఈమె వింత టెక్నిక్ వాడింది. పూరీలు నూనెలో వేసే ముందు, అందులో కొద్దిగా ఉప్పు వేసింది. ఆ తర్వాత రెండు టూత్ పిక్‌లను కూడా నూనెలో వేసేసింది. ఈ రెండింటిని వేసిన తర్వాత పూరీలను చేయడ స్టార్ట్ చేసింది. నూనెలో నుంచి పూరీలను (woman make puris without oil sticking) పరిశీలించగా.. వాటికి నూనె అస్సలు అంటుకోలేదు.
ఇలా సింపుల్‌గా నూనె అంటుకునే సమస్యకు పరిష్కారం చూపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఐడియా ఏదో బాగుందే’.. అంటూ కొందరు, ‘చిటికెడు ఉప్పు చాలు.. టూత్ పిక్‌లు వేయాల్సిన అవసరం లేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
అరెరే.. ఈమెకు పెద్ద కష్టమే వచ్చిందిగా.. స్కూటీని బయటికి తీయబోయి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి