Share News

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:57 PM

ఓ వ్యక్తి రైల్లో జనరల్ బోగీలో లగేజీ పెట్టే స్థలంలో పడుకున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా అతను పడుకున్న స్థలంలో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

Train Viral Video: వీడి తెలివి తెల్లారిపోనూ.. జనరల్‌ బోగీలో ఏసీ ఎఫెక్ట్.. ఏం చేశాడో చూడండి..

రైళ్లలో వింత వింత పనులు చేయడం, వాటిని వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వసాధారణమైపోయింది. కొందరు సీటు కోసం వినూత్న ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు సీటు లేకపోయినా తాళ్లు కట్టడం, చీర వేలాడదీయడం ద్వారా సొంతంగా సృష్టించుకుంటుంటారు. ఇంకొందరు ఏకంగా పడుకునే స్థలంలోనే స్విచ్ బోర్డు ఏర్పాటు చేసుకుని, దాని సాయంతో ఫోన్లకు చార్జింగ్ చేసుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి జనరల్ బోగీలో పడుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘రైల్వేలను ముంచేలా ఉన్నాడే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో జనరల్ బోగీలో (General Bogie) లగేజీ పెట్టే స్థలంలో పడుకున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా అతను పడుకున్న స్థలంలో చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.


పైన పడుకున్న ఆ వ్యక్తి ఉక్కపోతగా ఉందనుకున్నాడో ఏమో గానీ.. వెంట తెచ్చుకున్న కూలర్‌ను (Cooler) కూడా పైన పెట్టి దాన్ని ప్లగ్‌ను పక్కనే ఉన్న బోర్డులో పెట్టి ఆన్ చేశాడు. కూలర్ నుంచి చల్లని గాలికి హాయిగా నిద్రపోయాడు. అక్కడున్న వారంతా ఇతడి నిర్వాకం చూసి అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


‘రైల్వేలను ముంచేలా ఉన్నాడే’.., ‘వాడకం మామూలుగా లేదుగా’.., ‘ఇలాంటి మూర్ఖుల వల్లే రైల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి’.., ‘రైళ్లలో డీసీ కరెండ్ ఉంటుంది.. కూలర్ నడవాలంటే డీసీ కరెంట్ కావాలి’.., ‘టీటీఈ చూస్తే వీడి తిక్క కుదురుతుంది’.., ‘ఇతడిది చాలా తెలివితక్కువ పని’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3100కి పైగా లైక్‌లు, 3.97 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 07:58 PM