Share News

Cat VS Snake: ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Aug 24 , 2025 | 10:30 AM

ఓ పిల్లి ఇంటి ఆవరణలో ఉండగా.. కాసేపటికి ఓ పాము అటుగా వస్తుంది. పామును చూడగానే పక్కకు వెళ్లిపోవాల్సిన పిల్లి.. అందుకు విరుద్ధంగా దాంతో ఆడుకుంటుంది. పారిపోతున్న పామును ఏం చేస్తుందో చూడండి..

Cat VS Snake: ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

పిల్లులు, కుక్కలు, కోతులు కొన్నిసార్లు తమాషా చేస్తుంటాయి. ఇది చూడటానికి విచిత్రంగా అనిపించడమే కాకుండా తెగ నవ్వు వస్తుంటుంది. వీటికి, పాములకు మధ్య జరిగే ఫైట్ తమాషాగా ఉంటుంది. ఇలాంటి వింత సంఘటనలకు సంఘటనలకుసబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి పామును కెలికిమరీ ఇబ్బంది పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి ఇంటి ఆవరణలో ఉండగా.. కాసేపటికి ఓ పాము అటుగా వస్తుంది. పామును చూడగానే పక్కకు వెళ్లిపోవాల్సిన పిల్లి.. అందుకు విరుద్ధంగా దాంతో ఆడుకుంటుంది. పారిపోతున్న పామును (cat caused trouble for snake) తోక పట్టుకుని కెలికి మరీ ఇబ్బంది పెడుతుంది.


పిల్లి టచ్ చేయగానే పాము బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పిల్లి ఎంతో చాకచక్యంగా దాని కాటు నుంచి తప్పించుకుంటూ పదే పదే కాలితో కొడుతూ ఆడుకుంటుంది. ఎన్నిసార్లు పాము కాటేయాలని ప్రయత్నించినా కూడా.. పిల్లి ఎంతో తెలివిగా ఎస్కేప్ అవుతుంటుంది. పదే పదే పామును కాలితో గోకుతూ ఆడుకుంటుంది. పిల్లి చేసిన ఈ వింత నిర్వాకాన్ని.. ఆ ఇంటి యజమానికి తన కెమెరాలో బంధించాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పిల్లి మరీ విచిత్రంగా ఉందిగా’.. అంటూ కొందరు, ‘పాముకు చుక్కలు చూపించిన పిల్లి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.14 లక్షలకు పైగా లైక్‌లు, 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 07:31 PM