Share News

Shocking Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. కోతిని తరిమేయాలని చూడగా..

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:32 AM

కొన్ని కోతులు ఇంటి పైకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ వైర్లను పీకిపడేస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని తరిమేందుకు వచ్చాడు. కర్రతో వెంటపడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

Shocking Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. కోతిని తరిమేయాలని చూడగా..

ఇళ్లలోకి కోతులు చొరబడి చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. దీంతో కోతులు కనిపించగానే కొందరు కర్రలు, రాళ్లతో వెంటపడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొట్టడానికి వెళ్లిన వారిపై కోతులు తిరగబడడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. కోతులను తరిమేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కోతులు ఇంటి పైకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ వైర్లను పీకిపడేస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని తరిమేందుకు వచ్చాడు. కర్రతో (man chased away the monkeys) వెంటపడడంతో కోతులు పారిపోయాయి.


వాటిని తరుముతూ పైకప్పు చివరి అంచు వరకూ వెళ్లిన ఆ వ్యక్తి.. అంతటితో ఆగకుండా కర్రతో కిందకు కొడతాడు. ఈ క్రమంలో కర్రను విద్యుత్ లైన్లకు తగులుకుని షాక్ కొడుతుంది. చూస్తుండగానే ఆ వ్యక్తి కిందపడి (Man fell down due to electric shock) గిలగిలా కొట్టుకుంటాడు. అయితే కర్ర వెంటనే విద్యుత్ లైన్ నుంచి విడిపోవడం వల్ల అతడికి ప్రాణగండం తప్పింది. గాయాలైన అతను గిలాగిలా కొట్టుకుంటూ కేకలు పెట్టాడు. ఇంట్లోని వారు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపి అక్కడి నుంచి తీసుకెళ్లారు.


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘నివాస ప్రాంతాల్లో హైవోల్టేజీ లైన్లు వేయడం తప్పు’.. అంటూ కొందరు, ‘ఇతడి అదృష్టం బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 5.87 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 09:32 AM