Stunt Gone Wrong: బ్రిడ్జిపై నిలబడ్డ వ్యక్తి.. కింద వెళ్తున్న లగేజీ ఆటో.. సడన్‌గా దూకేయడంతో..
ABN , Publish Date - Aug 23 , 2025 | 08:50 AM
ఓ యువకుడు రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జ్‌పై నిలబడి స్టంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింద ఓ వ్యక్తి ఫోన్ కెమెరాను ఆన్ చేసి పెట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నెట్టింట ఫేమస్ అవ్వాల్నే ఉద్దేశంతో కొందరు సినిమాలో చేసే స్టంట్స్‌ని కొందరు నిజ జీవితంలో చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అవగాహన లేకుండా చేసే ఇలాంటి పనుల వల్ల చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నిలబడి ఉండగా.. కింద లగేజీ ఆటో వెళ్తోంది. సడన్‌గా పైనుంచి దూకేయడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జ్‌పై నిలబడి స్టంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కింద ఓ వ్యక్తి ఫోన్ కెమెరాను ఆన్ చేసి పెట్టుకున్నాడు.
ఇంతలో బ్రిడ్జ్ కింద ఓ లగేజీ ఆటో వెళ్లిపోతోంది. దాన్ని చూసిన యువకుడు సరిగ్గా ఆటో లగేజీపై దూకేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్న వెంటనే పైనుంచి కిందకు దూకేశాడు. అయితే ఆటో అప్పటికే దూరంగా వెళ్లిపోవడంతో ఆ యవుకుడు (Man jumps from bridge ) ధబేల్‌మని రోడ్డుపై పడిపోయాడు. దెబ్బకు అతను వామ్మో.. వాయ్యో.. అంటూ కేకలు పెట్టాడు. చాలా ఎత్తు నంచి పడడం వల్ల అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఇలా సినిమా స్టంట్ చేసి వైరల్ అవ్వాలని అనుకున్న యువకుడి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోరి కోరి చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 58 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి