Wedding Funny Video: ఈ వరుడిది గుండె కాదు బండ.. వధువు కిందపడడం చూసి..
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:36 PM
ఓ వివాహ కార్యక్రమంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు ఇద్దరూ వేదికపై కూర్చున్నారు. ఇంతలో బంధువులంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
వివాహ కార్యక్రమాల్లో వింత వింత సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు సినిమా సీన్లకు తలదన్నే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలా నవ్వు తెప్పించే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ వేదికపై వధూవరులు కూర్చుని ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏం గుండెరా అది.. ఆ గుండె బతకాలి.. అంటూ వరుడిని కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు ఇద్దరూ వేదికపై కూర్చున్నారు. ఇంతలో బంధువులంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో వారికి దిష్టి తీస్తున్నారు.
ఇలా ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతిథులు ఫొటోలు దిగుతుండగా.. వేదిక కూలి వధువు కుర్చీతో సహా (bride fell down) ధబేల్‌మని కిందపడుతుంది. ఆమెతో మరో ఇద్దరు అతిథులు కూడా పడిపోతారు. ఈ సీన్ చూసి చుట్టూ ఉన్న వారంతా ఉలిక్కిపడి లేచి అక్కడికి వచ్చారు. అయితే కుర్చీలో ఉన్న వరుడు మాత్రం.. ఎలాంటి కంగారూ లేకుండా కామ్‌గా కూర్చున్నాడు. వధువు పడిపోయే ముందు పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా.. ఆ తర్వాత సైలెంగ్‌గా అలాగే కూర్చుండిపోయాడు.
కనీసం ఆమెను పైకి లేపే ప్రయత్నం కూడా చేయకపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వరుడు మరీ విచిత్రంగా ఉన్నాడే’. అంటూ కొందరు, ‘అది గుండె కాదు బండ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 80కి పైగా లైక్‌లు, 17 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి