Share News

Bike Rider Accident Video: వద్దంటున్నా వరదనీటిలోకి దిగాడు.. చూస్తుండగానే..

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:20 PM

కొందరు బైకర్లు లడఖ్‌ కొండల్లో రైడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండల్లో సడన్‌గా వరద నీరు పొంగుకొచ్చింది. అయినా ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏమైందో చూడండి..

Bike Rider Accident Video: వద్దంటున్నా వరదనీటిలోకి దిగాడు.. చూస్తుండగానే..

బైక్ రైడింగ్ అనేది కొందరికి ఫ్యాషన్. ఎత్తైన కొండలు, కోనలు, అడవులు, రాళ్లు, గుట్టలు.. ఇలా ఇతరులకు సాధ్యం కాని ప్రదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తెలిసి కొన్నిసార్లు, తెలీక కొన్నిసార్లు బైకర్లు చేసే పొరపాట్లు.. చివరకు వారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వద్దంటున్నా ఓ బైకర్ వరదనీటిలోకి దిగాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. లడఖ్‌లోని (Ladakh) పాంగోంగ్ సరస్సు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లడఖ్‌కు బైక్ రైడర్లు ఎక్కువగా వస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక్కడి కొండల మధ్యన బైక్ డ్రైవింగ్ చేయడం వింత అనుభూతిని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఇదే షాకింగ్ అనుభవాన్ని కూడా ఇవ్వొచ్చు. తాజాగా, ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.


కొందరు బైకర్లు లడఖ్‌ కొండల్లో రైడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండల్లో సడన్‌గా వరద నీరు పొంగుకొచ్చింది. దీంతో బైకర్లలో కొందరు నదికి అవతలి వైపు ఉండగా.. ఇంకొందరు ఇవతలి వైపు నిలిచిపోయారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బైకుపై నదిని దాటేందుకు ప్రయత్నించాడు. పక్కన ఉన్న వారు వద్దని వారిస్తున్నా పట్టించుకోకుడా నీటిలోకి దిగేశాడు. అయితే బైకు ఇలా నీటిలోకి వెళ్లిందో లేదో.. వెంటనే స్లిప్ అయిపోయింది. చూస్తుండగా ఆ వ్యక్తి నీటిలో పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అతి సాధ్యం కాక.. (Biker washed away in floodwater) బైకుతో పాటూ అతనూ కిందకు కొట్టుకుపోయాడు.


స్నేహితుడు కొట్టుకుపోవడం చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కాస్త దూరం కొట్టుకుపోయాక.. ఆ వ్యక్తి ఎలాగోలా బయటపడినట్లు తెలిసింది. అయితే బైకు మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వరద నీటిలో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి’.. అంటూ కొందరు, ‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌‌‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 01:20 PM