Share News

Coal Theft in Train: సినిమా స్టైల్లో చోరీ.. రన్నింగ్ గూడ్స్ రైల్లో.. బొగ్గు ఎలా చోరీ చేస్తున్నారో చూస్తే..

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:46 AM

జార్ఖండ్‌‌ సాహిబ్‌గంజ్ జిల్లాలోని పాట్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్మాటియా-ఫరక్కా ఎంజీఆర్ రైల్వే లైన్‌‌లో గూడ్స్ రైలు వెళ్తుండగా 13, 14 ఏళ్ల లోపు ఉన్న దొంగలంతా అందులోకి ఎక్కేశారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Coal Theft in Train:  సినిమా స్టైల్లో చోరీ.. రన్నింగ్ గూడ్స్ రైల్లో.. బొగ్గు ఎలా చోరీ చేస్తున్నారో చూస్తే..

సినిమాల్లో కదిలే లారీలు, రైళ్లలోకి ఎక్కి చోరీలు చేసే సీన్లు చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లయితే ఇంతకు మించిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కదులుతున్న గూడ్స్ రైలు ఎక్కిన దొంగలు.. బొగ్గు చోరీ చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో.. ఎంతకు తెగిచార్రా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జార్ఖండ్‌‌ (Jharkhand) సాహిబ్‌గంజ్ జిల్లాలోని పాట్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్మాటియా-ఫరక్కా ఎంజీఆర్ రైల్వే లైన్‌‌లో (Coal goods train) గూడ్స్ రైలు వెళ్తుండగా 13, 14 ఏళ్ల లోపు ఉన్న దొంగలంతా అందులోకి ఎక్కేశారు. వీపునకు బొగ్గు ఎత్తడానికి అవసరమయ్యే ఇనుప గమేలాను కట్టుకున్నాడు. అలాగే నడుముకు ఇనుప పారను కట్టుకుని ఎంతో చాకచక్యంగా గూడ్స్ రైలు ఎక్కేశారు.


తర్వాత బోగీల్లోని బొగ్గును కిందపడేస్తున్నారు. మధ్య మధ్యలో బోగీలను అవలీలగా దిగుతూ, మరో బోగీలోకి మారుతున్నారు. వీరు చేస్తున్నది దొంగతనం (Coal theft on goods train) అని తెలిసి కూడా దర్జాగా, ఎంతో సరదాగా చేస్తున్నారు. పైగా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి ప్లాన్ ప్రకారం.. బోగీల్లోని బొగ్గును కింద పడేయగా.. కింద ఉన్న మరికొంత మంది యువకులు ఆ బొగ్గునంతా సేకరించి మూటలు కడతారు. తర్వాత వాటిని సమీప ప్రాంతాల్లో విక్రయిస్తుంటారట. ఇలా బొగ్గు రైల్లో చోరీలు చేయడం ఇది కొత్తేమీ కాదు. ఈ ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. మోతీ పహారీ, టెలో, ఫుల్భంగా, సోనాజోడి, ధోబాదిహా, ఇమ్లీ చౌక్, శివపహార్ తదితర ప్రాంతాల్లో ఇలా కదులుతున్న గూడ్స్ రైళ్లలో చోరీలు చేస్తుంటారు.


అయితే ఇలాంటి తప్పుడు పనుల్లో బాలులు కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇలాంటి చోరీలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. వీళ్లేంట్రా ఇంత ఈజీగా చోరీ చేసేస్తున్నారు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 6.29 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 08:46 AM