Share News

Woman Dance Viral Video: పోలీసు వాహనం ముందే మహిళ డాన్స్.. నెటిజన్ల రియాక్షన్స్ చూస్తే..

ABN , Publish Date - Aug 23 , 2025 | 10:19 AM

ఓ మహిళ రోడ్డుపై డాన్స్ చేస్తోంది. రోడ్డుపై డాన్స్ చేయడంతో షాక్ అవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. రోడ్డుపై డాన్స్ చేసి ఉంటే అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ..

Woman Dance Viral Video: పోలీసు వాహనం ముందే మహిళ డాన్స్.. నెటిజన్ల రియాక్షన్స్ చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మహిళలు యువకులతో పోటీపడి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరైతే మగవారు కూడా షాక్ అయ్యేలా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళ నడి రోడ్డుపై పోలీసు వాహనం ముందు డాన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డుపై డాన్స్ చేస్తోంది. రోడ్డుపై డాన్స్ చేయడంతో షాక్ అవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. రోడ్డుపై డాన్స్ చేసి ఉంటే అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ఈమె రోడ్డుపై పోలీసులు వాహనం ఎదురుగా డాన్స్ చేసేసింది.


పోలీసులు చూస్తున్నా కూడా ఏమాత్రం బిడియం, భయం లేకుండా (Woman dances in front of police vehicle) డాన్స్ చేస్తూనే ఉంది. ఈమె డాన్స్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అయితే ఈమెతో ఎందుకొచ్చిన సమస్య అని అనుకున్నారేమో గానీ.. అలా చూస్తుండిపోయారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. చాలా సేపు అలాగే డాన్స్ చేస్తూనే ఉంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వీధి కుక్కలను కాదు.. ముందు ఇలాంటి వారిని రోడ్ల మీదకు రాకుండా చేయండి సార్’.. అంటూ కొందరు, ‘పోలీసులు ఆమెను వారించకుండా.. అలా చూస్తుండిపోవడమేంటీ’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌‌లు, 21 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 10:21 AM