Share News

Leopard vs Dog Viral Video: వామ్మో.. చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:59 PM

మహారాష్ట్రలో నాసిక్‌లోని నిఫాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రాత్రి వేళ ఓ చిరుత పులి నిఫాద్ ప్రాంతంలోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిరుతను చూశాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Leopard vs Dog Viral Video: వామ్మో.. చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

జనావాసాల్లోకి చిరుతలు, సింహాలు చొరబడడ తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చిన్న చిన్న జంతువులను చూసి క్రూర మృగాలు పారిపోతుంటాయి. మరికొన్నిసార్లు మనుషులను చూసి భయపడుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ వీధిలోకి చొరబడిన చిరుతపై కుక్క దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. మహారాష్ట్రలో (Maharashtra) నాసిక్‌లోని నిఫాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రాత్రి వేళ ఓ చిరుత పులి నిఫాద్ ప్రాంతంలోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిరుతను చూశాయి. చిరుతను చూడగానే భయంతో పారిపోవాల్సిన కుక్కలు.. అందుకు విరుద్ధంగా దానిపై ఎటాక్ చేశాయి.


ఈ సీన్ చూస్తే ఎవరైనా.. చిరుత దాడిలో కుక్క చనిపోతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వాటిలో ఓ కుక్క చిరుతపై దాడి చేసి.. (Dog attacks leopard) చివరకు దాని గొంతు పట్టుకుని కొరికేసింది. ఈ దాడిలో కాసేపటికి చిరుత నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుక్క చిరుతను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. అయితే ఆ తర్వాత చిరుత ఎలాగోలా కుక్క నుంచి విడిపించుకుని అడవిలోకి పారిపోయింది.


ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కుక్క పవర్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘చిరుతకు చుక్కలు చూపించిందిగా’..అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:24 PM