Share News

Jugaad Viral Video: మిరపకాయలు కట్ చేయడం ఇంత ఈజీనా.. ఈమె ప్రయోగం చూశారంటే..

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:53 PM

సాధారణంగా ఉల్లిపాయలు, మిరపకాయలు కట్ చేసేందుకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో చాలా మంది ఇలాంటి పనులు చేసే సమయంలో తెలివిగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ మహిళ మిరపకాయలు కట్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Jugaad Viral Video: మిరపకాయలు కట్ చేయడం ఇంత ఈజీనా.. ఈమె ప్రయోగం చూశారంటే..

కొందరు మహిళలు వంటింట్లో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఒకేసారి ఐదు ఆరు చపాతీలు చేసేవారు కొందరైతే.. మరికొందరు గిన్నెలను కడిగేందుకు వాషింగ్ మిషిన్‌ను వాడేస్తారు. ఇంకొందరైతే ఏకంగా ఐరన్ బాక్స్‌తో వెంట్రుకలను స్టెయిటెనింగ్ చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ మిరపకాయలు కట్ చేసేందుకు విచిత్ర ప్రయోగం చేసింది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఉల్లిపాయలు, మిరపకాయలు కట్ చేసేందుకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో చాలా మంది ఇలాంటి పనులు చేసే సమయంలో తెలివిగా వ్యవహరిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకుని కొందరు, కళ్లకు టేప్ అంటించుకుని మరికొందరు ఉల్లిపాయలను కట్ చేస్తుంటారు.


అయితే తాజాగా ఓ మహిళ మిరపకాయలు కట్ చేసేందుకు వినూత్న ప్రయోగం చేసింది. ఇందుకోసం ఓ బ్లేడు, అట్టముక్క, చిన్న మోటారుతో (Blade, cardboard, small motor) కూడిన మిషిన్‌ను తీసుకుంది. అట్టముక్కకు స్విచ్‌తో పాటూ మిషిన్‌ను కూడా జాయింట్ చేసింది. ఆ మిషిన్‌కు బ్లేడ్‌ను తగిలిచింది. ఫైనల్‌గా స్విచ్ ఆన్ చేయగా బ్లేడు గిర్రున తిరిగింది. బ్లేడు పక్కనే ఉన్న రంధ్రం గుండా మిరపకాయలను లోపలికి పెట్టింది. బ్లేడ్ గిర్రున తిరుగుతుండడంతో అవి (Cutting chillies) ముక్కలు ముక్కలుగా కట్ అవుతున్నాయి. ఇలా మిరపకాయలన్నింటినీ సింపుల్‌గా కట్ చేసేసిందన్నమాట.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయంలో సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌‌లు, 3.52 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 12:53 PM