Drunken Man Funny Video: మత్తులో ఉన్నా ఫిజిక్స్ మర్చిపోలేదు.. వరద నీటిలో మందుబాబు నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:03 PM
ఫుల్‌గా మందు కొట్టిన ఓ వ్యక్తి భీకరంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దిగాడు. వాగు దాటడం సాధ్యం కాక అంతా రెండు వైపులా నిలబడి చూస్తుంటే.. ఇతను మాత్రం నేరుగా వాగులోకి దిగేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొందరు మందు కొట్టారంటే.. నన్ను మించినోడు ఈ ప్రపంచంలోనే లేడు.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి నాగు పామును చేతిలోకి తీసుకుని ముద్దు పెడితే.. మరో వ్యక్తి ఏకంగా పాములను నడుముకు బెల్టుగా చుట్టుకుంటాడు. ఇంకొందరు వాహనాలకు ఎదురెళ్లి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మందు తాగిన ఓ వ్యక్తి వరద నీటిలోకి దిగాడు. చివరికేమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ వ్యక్తి (Drunken Man) భీకరంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దిగాడు. వాగు దాటడం సాధ్యం కాక అంతా రెండు వైపులా నిలబడి చూస్తుంటే.. ఇతను మాత్రం నేరుగా వాగులోకి దిగేశాడు. దిగడమే కాదు .. ఎంతో చాకచక్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వైపు నుంిచ మరో వైపునకు వెళ్లాడు.
ఈ క్రమంలో ఏమాత్రం అడుగు తడబడ్డా కూడా వరద నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. అయినా అతను మాత్రం ఎక్కడా తడబడకుండా (Drunken man walking in floodwater) ఎంతో అవలీలగా దాటేశాడు. దీంతో అక్కడున్న వారంతా హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. వాగు దాటే సమయంలో అతడిలో ఏమాత్రం భయం కనిపించలేదు. పైగా అందరికీ అభివాదం చేస్తూ తానేదే ఘనకార్యం చేసినట్లుగా ఫీలయ్యాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘శరీరంలో మందు ప్రవాహం ముందు.. ఈ వరద ప్రవాహం ఏమీ చేయలేకపోయింది’.., ‘తాగినా కూడా ఫిజిక్స్‌ను బాగా ఫాలో అయ్యాడు’.., ‘క్రాస్‌గా నడవడం వల్ల కొట్టుకుపోకుండా దాటగలిగాడు’.., ‘90ఎమ్‌ఎల్ నిదానంగా ముందుకు నడిపిస్తుంది’.. అంటూ ఇలా కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి