Share News

Floods Viral Video: ఈ ఇల్లు కట్టినోడికి దండం పెట్టాల్సిందే.. వరద నీరు ముంచేసినా..

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:20 AM

భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఆ మార్గంలో ఓ ఇంటిని చుట్టుముట్టేసింది. ఇంటి చుట్టూ పైదాకా వరద నీరు ప్రవహిస్తోంది. అయినా ఆ ఇంటికి ఏమీ కాలేదు. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Floods Viral Video: ఈ ఇల్లు కట్టినోడికి దండం పెట్టాల్సిందే.. వరద నీరు ముంచేసినా..

వరద నీటి ముంపు ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్లు, ఇల్లు నేలమట్టమవుతుంటాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం పేకమేడల్లా కూలిపోయి వరదలో కొట్టుకుపోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఆ మార్గంలో ఓ ఇంటిని చుట్టుముట్టేసింది. ఇంటి చుట్టూ పైదాకా వరద నీరు ప్రవహిస్తోంది. అది కూడా భారీ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నా కూడా ఆ ఇంటికి ఏమీ కాలేదు.


సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద ఇళ్లు సైతం కూలిపోతుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ ఇంటికి మాత్రం ఏమీ కాదు. అంత పెద్ద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నా కూడా (house in middle of flood water) ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయిందన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఇంటిని కట్టినోడికి దండం పెట్టాల్సిందే’.. అంటూ కొందరు, ‘ఈ ఇంటిని మొత్తం కాంక్రీట్‌తో కట్టినట్లుందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 4.84 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 11:20 AM