Share News

Lovers Viral Video: పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. గదిలో వింత నిర్వాకం.. వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:41 AM

ఓ ప్రేమ జంట గదిలో స్నేహితుల సమక్షంలో (lovers got married) సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న ప్రేమికులు.. ఆ తర్వాత..

Lovers Viral Video: పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. గదిలో వింత నిర్వాకం.. వీడియో వైరల్..

ప్రేమ జంట చేసే పనులు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. పార్కులు, రైల్వే స్టేషన్లు, బైకుల్లో అసభ్యకరమైన పనులు చేసే ప్రేమికులను నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంట చేసిన విచిత్ర నిర్వాకం వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. గదిలో చేస్తున్న వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సిలిండర్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట గదిలో స్నేహితుల సమక్షంలో (lovers got married) సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న ప్రేమికులు.. ఆ తర్వాత పెళ్లి తరహాలోనే అగ్ని చుట్టూ ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.


అయితే అక్కడ పురోహితుడు గానీ.. హోమ గుండం కానీ లేదు. అయినా సరే ఎలాగైనా ఏడడుగులు వేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచిస్తున్న వారి బుర్రకు ఓ విచిత్రమైన ఐడియా తట్టింది. ఐడియా వచ్చిందే ఆలస్యం.. వంటింట్లో ఉన్న మినీ సిలిండర్‌ను తీసుకొచ్చి వెలిగించారు. సిలిండర్‌పై మంట వెలుగుతుండగా.. ఆ ప్రేమ జంట దాని చుట్టూ (Lovers circled around gas cylinder) ఏడు అడుగులు వేసి, దండం పెట్టుకుంది. ఇలా వంట చేసే సిలిండర్‌ను.. తమ పెళ్లికి ఇలా వాడేసుకున్నారన్నమాట.


వీరి విచిత్ర నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వీరి వివాహానికి సిలిండర్ సాక్షం’.. అంటూ కొందరు, ‘దీన్నే ఎమర్జెన్సీ వివాహం అని అంటారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా లైక్‌లు, 3.34 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 09:41 AM