Man Funny Viral Video: ప్రేమలో ఇలాంటి కష్టాలు ఉంటాయ్.. యువకుడి పరిస్థితిపై నెటిజన్లు రియాక్షన్..
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:41 AM
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. రాత్రి వేళ్ల ఓ వ్యక్తి ఇంటి పైకి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చే క్రమంలో ఇంటి పైనుంచి దూకాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ ఇంటి కిటికీ పట్టుకుని కింద ఉన్న ఇసుకపై దూకేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో నిత్యం వందలు, వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నింటిని చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ్ల ఇంటి పైనుంచి పడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ప్రేమలో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. రాత్రి వేళ్ల ఓ వ్యక్తి ఇంటి పైకి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చే క్రమంలో ఇంటి పైనుంచి దూకాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ ఇంటి కిటికీ పట్టుకుని కింద ఉన్న ఇసుకపై దూకేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లుగానే కిటికీ పట్టుకుని వేలాడి.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.
అయితే ఇసుక మీద పడాల్సిన వ్యక్తి కాస్తా.. ధబేల్‌మని నేలపై పడిపోయాడు. దెబ్బకు అతడికి చుక్కలు కనిపించాయి. కుయ్యో.. మొర్రో అనుకుంటూ పైకి లేచాడు. అయితే కాలికి బలమైన గాయమవడంతో (Man injured after jumping from house) నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఎవరైనా చూస్తారేమో అనే భయంతో కుంటుకుంటూనే మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా అతడి పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా తయారైందన్నమాట.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఇలాంటి బాధలు భరించాలి బ్రో’.. అంటూ కొందరు, ‘ప్రేమలో ఇలాంటి కష్టాలు తప్పవు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి